CTR: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని, పేదలకు వైద్యం భారం అవుతుందని వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పుంగునూరులో ఆదివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలను మంజూరు చేయించుకు వస్తే.. వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు.