ATP: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో మహాగణపతి, రుద్ర, చండీ హోమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ హోమాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హోమగుండాల చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.