అన్నమయ్య: రైల్వే కోడూరు మండలంలో దళిత, గిరిజనులకు శ్మశానవాటికలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పండుగోల మణి అన్నారు. సోమవారం ఎమ్మార్వో అమర్నాథ్కు వినతిపత్రం సమర్పించి, శ్మశానవాటికలు ఏర్పాటు చేయలన్నారు. అలాగే వాటికి ముళ్ల కంచె వేయాలని, గ్రామాల్లో విద్యుత్, నీటి సమస్యల్ని దూరం చేయాలని విజ్ఞప్తి చేశారు.