PDPL: గ్రామపంచాయతీ ఎన్నికలను నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంజపడుగు, రచ్చపల్లి గ్రామాలలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సోమవారం సిపి సందర్శించి శాంతిభద్రతల పరంగా తీసుకోవాల్సిన పలు సూచనలను సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.