SRCL: వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు గుడ్ల మైసయ్య, సుమారు 20 మందితో కలిసి సోమవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వాకులభరణం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సొయినేని కర్ణాకర్ పాల్గొన్నారు.