GNTR: తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాలు ఈ నెల 6 ,7, 8 తేదీలలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, హాస్య నటుడు బ్రహ్మానందం, ప్రజా సాహితీ సంపాదకులు కొత్తపల్లి రవిబాబులకు బొల్లిమంత శివరామకృష్ణ విశిష్ట పురస్కారాలు ప్రధానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.