AP: పల్నాడు జిల్లా నాగార్జునసాగర్ కుడికాలువలో దూకి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మాచర్లకు చెందిన వీర్ల గోవర్ధన్ యాదవ్, దాసరి శ్రీలక్ష్మి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరి వివాహానికి ఇరుకుటుంబాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఇద్దరూ నాగార్జునసాగర్ కుడి కాలువలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడి కోసం గాలిస్తున్నారు.