కృత్రిమ మేధ అనుసంధానంతో వచ్చిన ఓక్లీ మెటా స్మార్ట్ గ్లాసెస్ ఇప్పుడు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ క్రీడా పరికరాల తయారీ సంస్థ ఓక్లీ భాగస్వామ్యంతో మెటా ఈ గ్లాసెస్‌ను తీసుకొచ్చింది. వీటితో హై-క్వాలిటీ వీడియోలు, ఫొటోలు తీయొచ్చు. దీనిలోని వాయిస్ అసిస్టెంట్ ద్వారా అనేక పనులు సులభంగా చేసేయొచ్చు. వీటి ప్రారంభ ధర రూ.41,800.