స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ 2026 సంవత్సరానికి సంబంధించిన కానిస్టేబుల్ (GD) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న CAPFs, అసోం రైఫిల్, SSF తదితరాల్లో 25,487 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, పీఈటీ/పీఎస్టీ, వైద్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.