HNK: కాజీపేట మండలం కడిపికొండ బ్రిడ్జిపై ఇవాళ సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న యువతిపై యాసిడ్ దాడి చేశారు. ఈ యాసిడ్ దాడిలో యువతికి తీవ్ర గాయాలు కాగా.. గమనించిన స్థానికులు యువతిని MGM ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు జనగాం జిల్లా జఫర్ఘడ్కు చెందినవారీగా తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.