MDK: మనోహరాబాద్ మండలంలో రెండవ రోజు 294 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో రవీందర్ తెలిపారు. సర్పంచ్ పదవికి 53 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవులకు 241 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో 393 నామినేషన్లు దాఖలు కాగా, సర్పంచ్ పదవికి 76, వార్డు పదవులకు 317 నామినేషన్లు వచ్చినట్లు వివరించారు.