BHPL: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో BHPL జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి 31 వరకు పోలీస్ యాక్ట్-1861 అమలు చేస్తున్నట్లు SP సంకీర్త్ గౌడ్ తెలిపారు. పోలీసు అనుమతి లేకుండా ధర్నా, రాస్తారోకో, పబ్లిక్ మీటింగ్స్, సభలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డీజే వాడకం, ప్రభుత్వ ఆస్తులకు నష్టంకలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.