JGL: ధర్మపురి మండలం రాయపట్నం చెక్పోస్ట్ వద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్ రాం నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్న రాం నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని, జైలు శిక్షా తప్పదని హెచ్చరించారు.