అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు వెళ్లే భక్తుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి SCR ప్రత్యేక రైళ్లు నడపనుంది. కాకినాడ టౌన్-కొట్టాయం, కొట్టాయం-కాకినాడ టౌన్, నాందేడ్-కొల్లామ్, కొల్లామ్-నాందేడ్, చర్లపల్లి-కొల్లామ్, కొల్లామ్ చర్లపల్లి మీదుగా 54 రైళ్లు నడపనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. నిన్న ఉ.8 గంటల నుంచి ఈ రైళ్లకు సంబంధించిన బుకింగ్ ప్రారంభమయ్యాయని IRCTC వెల్లడించింది.