TG: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 494 మంది అతిథి అధ్యాపకులను నియమించనున్నారు. మొత్తం 566 మంది ఉద్యోగులను నియమించుకునేందుకు ఆర్థికశాఖ అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తాజాగా జీవో జారీ చేశారు. అలాగే, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేట్లు 72 మందిని నియమించుకునేందుకు ఇంటర్ విద్యాశాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.