ELR: ముదినేపల్లి బస్టాండ్‌ను డీపీటీవో షేక్ షబ్నం, ఏలూరు డిపోమేనేజర్ వాణితో కలిసి శనివారం పరిశీలించారు. బస్టాండు ఆవరణం, మరుగుదొడ్లు నిర్వహణను పరిశీలించారు. ఆవరణమంతా అపరిశుభ్రంగా, ఎక్కడి చెత్త అక్కడే ఉండటంతో పాటు విపరీతంగా దుమ్ము, ధూళి రావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారి కాంట్రాక్టు రద్దు చేసి కొత్త వారిని ఏర్పాటు చేయాలని సూచించారు.