KNR: సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కళా ఉత్సవ్-2025లో రాష్ట్రస్థాయిలో విజయం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. పదో తరగతి చదువుతున్న రోహిత్, ఆశిష్, రిత్విక్, హర్షిత్ గ్రామీణ సాంప్రదాయ ఒగ్గుడోలు కళా ప్రదర్శనలో ప్రతిభ చాటారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.