MBNR: ఎంపీ డీకే అరుణకు అరుదైన గౌరవం లభించింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అధికారికంగా నిర్వహించే విదేశీ పర్యటనలో ఎంపీ పాల్గొననున్నారు. ఈ మేరకు శనివారం రాష్ట్రపతి బృందంతో కలిసి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. అంగోల, బోట్స్వానా దేశాలలో రాష్ట్రపతితో కలిసి భారత అధికారిక ప్రతినిధిగా ఎంపీ డీకే అరుణ పర్యటించనున్నారు.