ATP: సీఎం చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పాలనా వైఫల్యాలను ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రతీకార రాజకీయాల కోసం పోలీసు వ్యవస్థను పావుగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.