CTR: కుప్పం నియోజకవర్గంలో త్వరలో మరో ఎనిమిది పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం ఏడు పరిశ్రమలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన సీఎం త్వరలోనే రూ. 6339 కోట్లతో సుమారు 43,000 మందికి ప్రత్యక్ష పద్ధతిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఎనిమిది పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.