SKLM: జలుమూరు మండలంలో పలు గ్రామాలలో స్టేషన్ ఎస్సై అశోక్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు నగిరి కటకం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు శనివారం ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు పెర్కొన్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన అన్నారు.