GNTR: కొల్లిపర మండలంలో ఇసుకను అనుమతుల్లేకుండా తరలిస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్‌లలో మాత్రమే అనుమతులతో తవ్వకాలు జరపాలని తహసీల్దార్ హెచ్చరించారు. అక్రమ రవాణా చేస్తున్న తొమ్మిది ట్రాక్టర్లను సీజ్ చేసి, ఒక్కో ట్రాక్టర్‌పై రూ. 5 వేల చలానా విధించినట్లు ఎస్సై కోటేశ్వరరావు వెల్లడించారు.