E.G: సంకష్టహర చతుర్థి పర్వదినం సందర్భంగా గోకవరం సీఎండీ కార్యాలయం వద్ద లక్ష్మీ గణపతి హోమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమాన్ని విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు, పద్మావతి దేవి గంగారత్నం దంపతులచే, అర్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాధరావు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని నిర్వహించామన్నారు.