AP: శ్రీభక్త కనకదాస జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ‘తెలుగు, కన్నడ ప్రజలకు, కురుబ సామాజికవర్గానికి ఆరాధ్యుడు శ్రీభక్త కనకదాస. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా తన రచనలు, కీర్తనల ద్వారా సమాజంలో నెలకొన్న కులవివక్షను రూపుమాపేందుకు కృషి చేశారు. కనకదాస జయంతిని జరుపుకుంటున్న వేళ.. ఆ మహనీయుని సాహిత్య, సంగీత, సామాజిక సేవలను స్మరించుకుందాం’ అని సీఎం ట్వీట్ చేశారు.