TG: రాష్ట్రవ్యాప్తంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ విద్యను మరింత అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 1000 ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించగా.. వచ్చే ఏడాది నుంచి మరో 4,900 స్కూళ్లలో ప్రీ ప్రైమరీని స్టార్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో పాఠశాలలో టీచర్, ఆయాను నియమించనుంది.