దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతాన్ని మించే వీలుందని ప్రముఖ ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. GST తగ్గింపు, ఆదాయ పన్ను రాయితీలు వినియోగాన్ని ప్రోత్సహించి, వృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. వ్యవసాయం, వాణిజ్యం, ఆతిథ్యం, ఆర్థిక సేవలు, స్థిరాస్తి రంగాలు బలంగా ఉన్నాయని వెల్లడించారు.