GDWL: మొబైల్ ఫోన్లను, చెడు వ్యసనాలను దూరంగా ఉంచి, మంచి దారిలో నడిచి బంగారు భవిష్యత్తు వైపుగా అడుగులు వేయాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన పదో తరగతి విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నాడు. విద్యార్థులు జాగ్రత్తగా చదువుకోవాలన్నారు.