మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కళాశాలలో బంజారా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టోర్నమెంట్‌కు సంబంధించిన వాల్ పోస్టర్లను నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేందర్ రెడ్డి వినోద్ కుమార్, ఎంపీ వెంకటేష్ శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రచార కార్యదర్శి సీజే బెనర్ పాల్గొన్నారు.