BDK: చర్ల మండలంలో శనివారం బట్టి గూడెం గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. కీర్తిశేషులు కాండ్రకోట వెంకట శేషమాంబ జ్ఞాపకార్థం వారి కుమార్తె ఆర్ఎంపీ డాక్టర్ కే. సుధారాణి ఐదువేల రూపాయల వితరణగా ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబానికి ఆసరాగా నిలవడం గర్వంగా ఉందన్నారు.