SRD: కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేద్దామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు అన్నారు. చౌటకూర్ మండలం శివంపేట పరిధిలోని సీబీఎల్ పరిశ్రమలో నూతన లేబర్ పాలసీ పై సెమినార్ శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ చట్టాలు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు.