MDCL: ఉప్పల్‌లోని మల్లికార్జుననగర్‌లో శ్రీకాంత్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. 2009 బ్యాచ్‌కు చెందిన ఇతను ఫిల్మ్‌నగర్ పీఎస్ లో పనిచేస్తున్నాడు. శ్రీకాంత్ తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత నెల 23 నుంచి అతను విధులకు హాజరు కాలేదని ఉన్నతాధికారులు తెలిపారు. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.