సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకలకు రావాలని గోవా సీఎం డాక్టర్ ప్రమోద్ సావంత్‌కు ఆహ్వానం అందింది. గోవా శ్రీ సత్యసాయి సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ పావస్కర్.. సీఎంను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. రాజ్యసభ ఎంపీ సదానంద తనవ్డే, కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్‌లను సైతం ఆహ్వానించినట్లు సభ్యులు తెలిపారు.