KMM: ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాచుకున్న నగదు చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం సరికాదని, తక్షణమే బకాయిలు చెల్లించాలని TSUTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వెంకట్ డిమాండ్ చేశారు. మధిర మండల మహాసభలో ఆయన మాట్లాడుతూ.. టెట్ మినహాయింపుకై విద్య హక్కు చట్టం సెక్షన్ 23 సవరించాలని కేంద్రాన్ని కోరారు.