WGL: తుఫాను కారణంగా ఇటీవలి భారీ వర్షాలకు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వరద ముంపుల్లో విస్తృత సేవలందించిన పారిశుద్ధ్య సిబ్బంది, డ్రైవర్లకు రూ.వేయి చొప్పున ప్రోత్సాహకాలు అందించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మేయర్ గుండు సుధారాణి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో ఈ ప్రోత్సాహకాలు సిబ్బంది అకౌంట్లలో జమ అవుతాయని పేర్కొన్నారు.