MLG: తాడ్వాయి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఇవాళ సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. లారీ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న విష్ణు, రాజు అనే ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, వారిని ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.