ADB: విధులలో నిజాయితీ, క్రమశిక్షణ తప్పనిసరి అని SP అఖిల్ మహాజన్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా తాంసి పోలీస్ స్టేషన్ను అఖిల్ మహాజన్ శనివారం సందర్శించారు. మొదటగా సిబ్బంది ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించి పరిశుభ్రతపై SP ప్రశంసించారు. DSP జీవన్ రెడ్డి, సీఐ ఫణిందర్, ఎస్సై జీవన్ రెడ్డి తదితరులున్నారు.