KMM: కారేపల్లి సింగరేణి గ్రామపంచాయతీకి చెందిన నిరుపేద కుటుంబంలో వివాహానికి బీఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్ ఆపద్బాంధవుడుగా ఆదుకున్నారు. షేక్ జమీల్ కుమార్తె పెళ్లి సందర్భంగా ఆయన పెద్ద మనసు చేసుకుని, సుమారు రూ.30,000 వేల విలువైన డబుల్ కాట్ మంచం, డ్రెస్సింగ్ టేబుల్, కుర్చీలు సహా ఇతర సామాగ్రిని, నగదును అందజేశారు.