E.G: రాజమండ్రి రాజేంద్రనగర్‌కు చెందిన నాలుగేళ్ల బాలుడు బి. యశ్వంత్ ఆడుకుంటూ వేడి నీళ్లలో పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ విషయాన్ని ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ కె.సత్తిబాబు ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించారు. బాలుడికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 30 వేల ఆర్థికసాయం అందించారు.