KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయ ఇంఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన వేగం పెరిగిందన్నారు.