బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. నిన్న రోహ్తాస్ జిల్లాలో ఆయన ర్యాలీ ఉండగా.. అదే సమయంలో ప్రధాని మోదీ ఔరంగాబాద్, కైమూర్ జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రధాని విమానం టేకాఫ్ అవుతుండగా, తన హెలికాప్టర్‌ను 2 గంటలు నిలిపివేశారని ఆరోపించారు. మోదీ కారణంగానే తన ప్రచారానికి ఇబ్బంది తలెత్తిందని ఖర్గే మండిపడ్డారు.