AP: బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ఎక్కడైనా.. ఎక్కడికైనా.. ఏ అంశం మీదైనా చర్చకు సిద్ధమన్నారు. వైసీపీ ఆఫీసులో అయినా చర్చకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ అంతరించిపోవడం ఖాయమన్నారు. విశాఖ సమ్మిట్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. కానీ, మీ బతుకంతా SIT ఎదుట హాజరవ్వడానికే సరిపోతోందన్నారు.