AP: 15ఏళ్లు కూటమి ఉండాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వైసీపీ నేత అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ’15ఏళ్లు కాదు.. జీవితాంతం కలిసి ఉన్నా మాకు నష్టం లేదు. రేపు లోకేష్ సీఎం అయినా.. పవన్ను డిప్యూటీ సీఎంగా ఉండమనండి. చంద్రబాబు, పవన్ కలిసి ఉంటేనే మాకు లాభం. 2024లో మా వ్యతిరేక ఓటు కూటమికి పడింది. 2029లో కూటమి వ్యతిరేక ఓటు మాకు పడుతుంది’ అని అన్నారు.