KDP: ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ బకాయిలు వసూలు చేయాలని మున్సిపల్ ఛైర్పర్సన్ బీమునిపల్లె లక్ష్మీదేవి డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆమె శనివారం నిరసన దీక్ష చేపట్టారు. కమిషనర్ మున్సిపాలిటీ ఆస్తులను కాపాడకుండా వ్యవహరిస్తున్నారని, ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ పూర్తి లీజు చెల్లించకుండానే గ్రౌండ్ ఇవ్వడం కౌన్సిల్ తీర్మానానికి విరుద్ధమని విమర్శించారు.