W.G: పాలకొల్లు బ్రాడీపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ పాలూరి రమేష్ (46) మృతి చెందాడు. ఈ నెల 4న విధులకు వెళ్తూ పొరపాటున మంచినీళ్ల సీసాకు బదులు కలుపుమందు సీసాను తీసుకెళ్లారు. మార్గమధ్యంలో నీళ్లు అనుకుని దానిని తాగడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన మరణించారు.