WNP: జిల్లాలోని నంది హిల్స్ కాలనీ నుంచి కేడీఆర్ నగర్ వైపు వెళ్లే ప్రధాన రహదారి పలుచోట్ల దెబ్బతిని, పెద్ద పెద్ద గుంతలుగా మారింది. దీంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.