TG: బీజేపీ, కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. ‘నేతలను జైల్లో పెట్టేందుకు ప్రజలు అధికారం ఇచ్చారా? ప్రజలకు మంచి చేయడానికా?. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి.. ఇద్దరూ ఫ్రస్టేషన్లో ఉన్నారు. వాళ్లు ఎన్ని నాటకాలు చేసినా.. మళ్లీ కేసీఆరే అధికారంలోకి రావాలని ప్రజలు స్పష్టమైన అవగాహనతో ఉన్నారు’ అని అన్నారు.