MDK: రామాయంపేట మండల కేంద్రంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జన్మదినం పురస్కరించుకొని టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.