AP: అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పర్యటనలో మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తనపై 32 కేసులు పెట్టారని, సీఎం చంద్రబాబును 53 రోజులు జైల్లో బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిని తీవ్రంగా అవమానించారని, ఎవ్వరినీ వదలిపెట్టమని హెచ్చరించారు. అహంకారంతో 151 నుంచి 11కు పడ్డారని ఆరోపించారు. ఏపీలో పెట్టుబడులను చూసి కర్ణాటక షేక్ అవుతోందని పేర్కొన్నారు.