TG: టెలివిజన్ అవార్డ్స్-2024 కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ.. అవార్డ్స్ నిర్వహణ విధానాలు రూపొందించడంతోపాటు అవార్డుల లోగో, పేరుకు తుది రూపుదిద్దుతుంది.