NLG: ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఏడాది కాలం విక్రయ హక్కుల కోసం ఈ నెల 14న టెండర్ కమ్ బహిరంగ వేలం జరగనుందని కమిటీ ఛైర్మన్ చీదేటి వెంకట్ రెడ్డి, ఈవో అంబటి నాగిరెడ్డి తెలిపారు. కొబ్బరికాయల హక్కుకు రూ.10 లక్షలు, లడ్డు, పులిహోరకు రూ.2 లక్షలు, పూలు, పండ్లకు రూ.3 లక్షలు, గాజుల అమ్మకాలకు రూ.1 లక్ష డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.